అమరావతి రైతుల పోరాటం 499రోజులకు చేరుకుంది. రాజధాని గ్రామాల్లో రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలతో పోరాటం చేస్తున్నారు. వెలగపూడి, తుళ్లూరు, మందడంతో పాటు పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపటితో అమరావతి ఉద్యమానికి 500రోజులు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అమరావతి ఐకాస సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహించాలని ఐకాస నేతలు నిర్ణయించారు. తమ పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:
499వ రోజు అమరావతి రైతుల నిరసన - అమరావతి రైతుల నిరసన తాజా వార్తలు
అమరావతినే పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 499వ రోజుకు చేరుకుంది. రేపటితో అమరావతి ఉద్యమానికి 500రోజులు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అమరావతి ఐకాస సిద్ధమైంది.
![499వ రోజు అమరావతి రైతుల నిరసన amaravathi farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-04-29-14h13m45s449-2904newsroom-1619685934-195.jpg)
amaravathi farmers