ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆమరణ నిరాహార దీక్షకూ వెనకాడబోం: అమరావతి మహిళలు

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ 423 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ మహిళలు చేస్తున్న నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్షకూ సిద్ధమని వారు హెచ్చరించారు.

By

Published : Feb 12, 2021, 7:17 PM IST

amaravati agitations reached 423 days
423వ రోజుకి చేరిన అమరావతి రైతులు, మహిళల దీక్షలు

మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ అమరావతిలో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలు 423వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు, మందడం, అనంతవరం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో.. పలువురు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాజధానిలోని భవన నిర్మాణాలతో పాటు తమకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ.. అనంతవరం, తుళ్లూరు మహిళలు ఐదవ రోజు నిరాహార దీక్షలు కొనసాగించారు. ఉక్కు పరిశ్రమ విషయంలో జగన్ ప్రభుత్వం స్పందించకపోతే.. ఆమరణ దీక్షకైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details