మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం
15:16 July 11
సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో చర్చలు
Municipal Workers Strike: పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ సాయంత్రం సచివాలయంలోని రెండో బ్లాక్లో మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపనుంది. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల జేఏసీని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలకు ఆహ్వానించారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె అంశాన్ని పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని హైపవర్ కమిటీని సీఎం జగన్ ఆదేశించారు.
MUNICIPAL WORKERS PROTEST: సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. పలు జిల్లాల్లో విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. వీరికి పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: