Amaravati roads: రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్ల నిర్వహణ, పర్యవేక్షణ లేక ధ్వంసమైపోతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రహదారులు పాడైపోతున్నాయి. నీరుకొండ, నిడమర్రు గ్రామాలను కలిపే రోడ్డు భారీగా బీటలు వారి డ్రైనేజీ కాలువలోకి ఒరిగిపోతోంది. పట్టించుకునేవారే కరవయ్యారు.
Amaravati roads: రాజధాని రోడ్లు.. ముక్కలుచెక్కలు.. ఎటు చూసినా.. - గుంటూరు జిల్లా తాజా వార్తలు
Amaravati roads: రాష్ట్రంలో రహదారులు నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన బీటలు, గోతులతోనే కనిపిస్తున్నాయి. రోడ్లలో గోతులు కాదు.. గోతుల్లోనే రోడ్లు ఉన్నాయంతగా మారిపోయాయి. వర్షాల ధాటికి రహదారులపై ఎక్కడ చూసినా నీరు నిండిపోయింది. ఏ వైపు వెళ్తే ఏ గోతిలో పడతామో అని ప్రజలు భయంభయంగానే.. తప్పక ప్రయాణాలు సాగిస్తున్నారు. చివరికి ఈ ఇక్కట్లు రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనూ తప్పడంలేదు.
రాజధాని రోడ్లు