ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 16, 2020, 7:15 PM IST

ETV Bharat / city

అమరావతి పరిధిలో తహసీల్దార్లే జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు

రాజధాని అమరావతి పరిధిలో పేదలకు అందించే టిడ్కో ఇళ్ల విక్రయ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్​లుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల తహసీల్దార్లను తాత్కాలికంగా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు.

joint sub registrars
joint sub registrars

రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే టిడ్కో ఇళ్లకు సంబంధించి విక్రయ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ల కోసం స్థానిక తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్​లుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు ఇచ్చారు. రాజధాని అమరావతి పరిధిలోని అర్బన్ తహసీల్దార్లు లేకపోవడంతో ఆయా మండలాల తహసీల్దార్లనే టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా టిడ్కో ఇళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఇందుకోసం తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్​లుగా తాత్కాలికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చదవండి :సుప్రీం స్టే ఇస్తేనే.. 'రాజ్యాంగ విచ్ఛిన్నం'పై విచారణ ఆపుతాం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details