ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం.. 336వ రోజుకు చేరింది. కృష్ణాయపాలెంలో కర్షకులు జోలె పట్టి నిరసన తెలిపారు. ఉద్ధండరాయునిపాలెంలో మోకాళ్లపై నిల్చొని ఆందోళన చేపట్టారు. సున్నావడ్డీ పథకం నిధులతో పాటు దళిత రైతులకు కౌలు చెక్కులూ అందించాలని డిమాండ్ చేశారు.
రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలలో రైతుల ఉద్యమానికి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మద్ధతు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టై.. బెయిల్ మీద విడుదలైన కర్షకులతో ఆయన మాట్లాడారు. ఉద్ధండరాయునిపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నీరుకొండ గ్రామాల్లోనూ రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేస్తున్నారు.