నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమ బావుటా ఎగురవేసి.. ఇవాళ్టీతో 800వ రోజులైంది. రాజధాని కోసం.. ప్రాణ సమానమైన భూములను వారు ప్రభుత్వానికి అప్పగించారు. రైతుల ఆశలు, ఆకాంక్ష మేరకు.. గత ప్రభుత్వ హయాంలో పనులు సజావుగానే జరిగాయి. అయితే.. రెండున్నరేళ్ళుగా రైతుల కలలు కల్లలయ్యాయి. రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా 3 రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలతో.. వారంతా రోడ్డెక్కారు. తమకు జరిగిన అన్యాయాన్ని వాడవాడలా తెలిసేలా నిరంతరం పోరాటం సాగిస్తున్నారు.
ప్రతీసారి విజయమే..
అమరావతి ఉద్యమంలో మహిళలదే ప్రధాన పాత్ర. వారికి రైతులు, యువకులు తోడయ్యారు. పాదయాత్రలు, ద్విచక్రవాహనాల ర్యాలీ, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలతో పాటు.. రైతు గర్జన, జనభేరి కార్యక్రమాల్ని నిర్వహించారు. 100వ రోజు నుంచి 700వ రోజు వరకూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వారి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి సందర్భంలోనూ.. విజయం రైతన్నదే. ఇక న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర విజయవంతం గురించి.. జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.
కేంద్రం చెబుతున్నా..