రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ హామీ ఇచ్చినట్లు అమరావతి ఐకాస నేతలు తెలిపారు. సీఆర్‌డీఏ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రైతులు.. హైకోర్టు తీర్పు ప్రకారం నిర్ణీత గడువులోగా అమరావతి నిర్మాణం చేపట్టాలని కోరినట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ ఇవ్వాలని విన్నవించామన్నారు. పెండింగ్ పెన్షన్లను, కౌలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు వివరించారు. గతంలో అమరావతి ప్లాట్లపై బ్యాంకు రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వటంలేదని నేతలు తెలిపారు. బ్యాంకులతో సమావేశం నిర్వహించి రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు: రాజధాని రైతులు - రాజధాని రైతులు న్యూస్
సీఆర్‌డీఏ అధికారులతో అమరావతి జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు.
సమస్యలు పరిష్కరిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ హామీ ఇచ్చారు