రాజధానిలో అభివృద్ధి పనుల్ని కొనసాగించేలా అధికారులను ఆదేశించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాఖ్యం దాఖలు చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.... కొనసాగుతున్న పనుల్ని నిలిపేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని వ్యాఖ్యంలో పేర్కొన్నారు. పనుల్ని నిలిపేయడం.... రాజ్యాంగ నిబంధనలు, సీఆర్‌డీఏ చట్టం, విభజన చట్ట నిబంధలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందరి సమ్మతితోనే రాజధాని నిర్మాణం చేసేందుకు శాసనసభ తీర్మానం చేసిందన్నారు. వేల మంది రైతులు ప్రభుత్వానికి భూములివ్వగా అభివృద్ధి పనులు ప్రారంభించారన్నారు . 2019లో ప్రభుత్వం మారాక రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపునకు వివిధ శాఖలు సహకారం అందించలేదన్నారు . రాజధానిపై పలువురు మంత్రులు అవహేళనగా మాట్లాడుతున్నారని... రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం వల్ల ఆర్థిక సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వెళ్లిపోయాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఆర్‌డీఏ చట్టం ప్రకారం అభివృద్ధి పనుల్ని కొనసాగించేలా అధికారుల్ని ఆదేశించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి , కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి , సీఆర్‌డీఏ కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
'అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగేలా ఆదేశాలివ్వండి'
అమరావతిలో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పనుల్ని నిలిపేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని వ్యాఖ్యంలో పేర్కొన్నారు
ap high court