అమరావతి కోసం రాజధాని గ్రామాల్లో 100వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. ఇళ్ల వద్ద కొందరు, దీక్షా శిబిరాల సామాజిక దూరం పాటిస్తూ ఇంకొందరు ఎక్కడికక్కడ... అమరావతే రాజధానిగా కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన విరమించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ప్రకటిస్తే తాము లాక్‌డౌన్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతామని అంటున్నారు.
అమరావతి: సామాజిక దూరం పాటిస్తూనే నిరసనలు - ఏపీలో మూడు రాజధానుల వార్తలు
అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 100 రోజులకు చేరుకున్నాయి. ఇవాళ దీక్ష శిబిరాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ జై అమరావతి నినాదాలు చేశారు.
amaravati fornmers struggle reach hundred days