అధికారులను అడ్డుకున్న అమరావతి రైతులు - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
అమరావతిలోని భూములను ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కృష్ణాయపాలెంలో భూములను గుర్తించేందుకు వచ్చిన అధికారులను అమరావతి రైతులు అడ్డుకున్నారు. సర్వే చేసేందుకు అంగీకరించబోమంటూ అధికారుల కారును గ్రామస్థులు చుట్టుముట్టారు. రెవెన్యూ అధికారులు వెనక్కి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై బెఠాయించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
amaravati farmers stoped revenue officer in krishnayapalem