ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP repeals 3 Capitals Act: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు: అమరావతి ఐకాస - AP repeals the Three Capitals Act

మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(amaravathi farmers on ysrcp repeal 3 capital act) తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

farmers on ap 3 capitals act withdraws
మూడు రాజధానుల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అమరావతి ఐకాస

By

Published : Nov 22, 2021, 1:23 PM IST

Updated : Nov 22, 2021, 7:02 PM IST

ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి(Amaravathi jac on 3 capitals withdraws) ఐకాస ప్రకటించింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస కోరింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఐకాస నేతలు.. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ఐకాస నేతలు.. ఏకైక రాజధానిగా అమరావతిని(ap 3 capitals withdraws) ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటన వచ్చిన తర్వాతే ప్రభుత్వాన్ని నమ్ముతామని రైతులు స్పష్టం చేశారు.

పోరు ఆగదు..

3 రాజధానుల బిల్లును సమగ్రంగా ప్రవేశపెడతామని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై.. మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు మండిపడ్డారు. ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరు ఆపబోమని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి..

AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ

Last Updated : Nov 22, 2021, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details