రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి ఉద్యమం.. 403వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, పెదపరిమి, బోరుపాలెం, వెంకటపాలెం, నెక్కల్లులో నిరసన దీక్షలు కొనసాగాయి.
నెక్కల్లులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద.. రైతులు, మహిళలు ధర్నా నిర్వహించారు. ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరం నుంచి బయటకు వచ్చి.. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి గెలుస్తామని నమ్మకం ఉన్నపుడు ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.