మూడు రాజధానుల ప్రకటన నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను.. 402వ రోజూ కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, ఐనవోలు, బోరుపాలెం, దొండపాడు, నెక్కల్లులో.. మహిళలు, రైతులు పెద్దఎత్తున దీక్షల్లో పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు ఇస్తామని హామీ ఇచ్చిన అన్ని అంశాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భూములిచ్చే సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు.
402వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు - ఉద్యమానికి అండగా నిలుస్తున్నందుకు మాజీ మంత్రి ఉమకు ధన్యవాదాలు తెలిపిన అమరావతి రైతులు
రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి రైతులు చేపట్టిన దీక్ష.. 402వ రోజుకు చేరింది. భూములిచ్చే సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమానికి అండగా నిలిచిన మాజీ మంత్రి ఉమకు కృతజ్ఞతలు తెలిపారు.
402వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు
మాజీ మంత్రి దేవినేని ఉమను కలిసిన ఉద్ధండరాయునిపాలెం రైతులు.. తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని తరలిపోతోందనే దిగులుతో శుక్రవారం మృతి చెందిన షేక్ కరిముల్లా మృతదేహానికి.. ఐకాస నేతలు సుధాకర్, గద్దె తిరుపతిరావు, గుంటూరు పార్లమెంట్ తెదేపా బాధ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఘన నివాళులర్పించారు.
ఇదీ చదవండి: 'కొత్త జిల్లాకు జాషువా పేరు ప్రతిపాదిస్తాం’