ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravati Protest: 558వ రోజు రైతులు, మహిళల నిరసనలు - three capitals for andhrapradesh

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 558వ రోజు రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా ఉద్ధృతి తగ్గటంతో దీక్షా శిబిరాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.

Amaravati farmers protests against 3 capitals
Amaravati farmers protests

By

Published : Jun 27, 2021, 7:25 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు.. 558వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, నెక్కల్లు, బోరుపాలెంలో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దీక్షా శిబిరాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇన్నాళ్లు ఇంటి నుంచే ఆందోళనలు చేసిన రైతులు, మహిళలు.. దీక్షా శిబిరాల నుంచే నిరసనలు తెలియజేస్తున్నారు. సీఎంకు పరిపాలన అనుభవం లేకపోవడం వల్లే ఏపీ నుంచి ఒక్కో పరిశ్రమ తరలివెళ్లిపోతోందని రైతులు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details