పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 285వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, వెంకటపాలెం, ఐనవోలు, నీరుకొండ, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తుళ్లూరు,వెలగపూడి, మందడంలో రైతులు నిర్వహించిన దీక్షలో పాల్గొన్నారు.
ఏకాదశి సందర్భంగా కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో రైతులు శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి గీతాపారాయణం చేశారు. వెంకటపాలెంలో మహిళలు, రైతులు నిరసనను తెలియజేశారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టారంటూ ఆరోపించారు. అన్ని జిల్లాల రైతులు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని మహిళలు చెప్పారు. ప్రభుత్వం మారాలన్నారు.