అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 514వ రోజుకు చేరింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, వెలగపూడి, బోరుపాలెం, అనంతవరం, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం, రాయపూడి. పెదపరిమి, మందడం గ్రామాల్లో రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయస్థానాలు అండగా నిలుస్తాయని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. నిరసనలు 514 రోజులకు చేరుకున్నా ..ప్రభుత్వం నుంచి ఇసుమంతైన స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
514వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ధర్నా - Amaravati farmers protest news
అమరావతే రాజధాని కావాలంటూ రైతులు, మహిళలు చేసే నిరసనలు 514వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను న్యాయస్థానాలు వింటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి రైతుల ధర్నా