రాజధాని ఉద్యమం 150 రోజులు పూర్తైన సందర్భంగా రైతులు అమరావతి వెలుగు పేరుతో శుక్రవారం రాత్రి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం తుళ్లూరు, మందడం, దొండపాడు, బోరుపాలెం, వెంకటపాలెం, వెలగపూడి, పెదపరిమి గ్రామాల్లో రైతులు, మహిళలు భౌతిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, రైతులు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. భాజపా నాయకులు వెలగపూడి రామకృష్ణ తుళ్లూరులో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం, ఉద్యమంలో అశువులు బాసిన 63 మంది రైతులకు సంఘీభావంగా... రెండు నిమిషాలు మౌనం పాటించారు. రైతులు 150 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా... ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని మహిళలు ఆరోపించారు. ప్రభుత్వం ఎలాగైనా విశాఖకు రాజధానిని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని.. అవసరమైతే ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని రామకృష్ణ చెప్పారు.
'అమరావతి వెలుగు' పేరుతో తూళ్లూరు మండలం రైతుల నిరసన - అమరావతి రైతుల నిరసన తాజా వార్తలు
అమరావతి వెలుగు పేరుతో శుక్రవారం రాత్రి తూళ్లూరు మండలంలోని రైతులు నిరసన కార్యక్రమాలు చేశారు. రాజధాని ఉద్యమం 150 రోజులు పూర్తైనందుకు ఈ నిరసన చేపట్టారు. మహిళలు, రైతులు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో భాజపా నేత వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు.
అమరావతి వెలుగు పేరుతో రైతులు నిరసన