ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మందడం శిబిరం వద్ద రైతుల ఆందోళన.. భారీగా పోలీసుల మోహరింపు - గుంటూరు జిల్లాలో అమరావతి రైతుల ఆందోళన

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మందడంలో దీక్షా శిబిరం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్తుండగా.. రైతులు, మహిళలు శిబిరం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైతులు రాజధాని కోసం నినాదాలు చేస్తున్నారు.

amaravathi farmers latest
amaravathi farmers latest

By

Published : Nov 30, 2020, 9:36 AM IST

Updated : Nov 30, 2020, 9:48 AM IST

మందడం శిబిరం వద్ద రైతులు ఆందోళన.. భారీగా మోహరించిన పోలీసులు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నేపథ్యంలో అమరావతి రైతులు వినూత్న నిరసన చేపట్టారు. శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు అమరావతి ఉద్యమ జెండా చూపిస్తూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చిన తమను ఆదుకోవాలంటూ రైతులు నిరసన తెలిపారు.

రైతులు, మహిళలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేయగా.. సీఎం వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కల్లంలో నీళ్లు...కళ్లలో దుఃఖం

Last Updated : Nov 30, 2020, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details