అమరావతి ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేలా ఆదేశించాలని రాజధాని రైతులు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎమ్.సత్యనారాయణమూర్తి ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. భూసమీకరణలో తీసుకున్న భూముల్ని ప్రభుత్వం ఇతరులకు కేటాయించే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ పూర్తైయ్యే వరకు సీఆర్డీఏకు చెందిన భూములను ఇతరులకు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. సకాలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వనందుకు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
హైకోర్టులో రాజధాని రైతుల వ్యాజ్యం
తమ ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని రాజధాని రైతులు హైకోర్టులో పటిషన్లు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సీఆర్డీఏ భూములను ఇతరులకు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
హైకోర్టులో రాజధాని రైతుల వ్యాజ్యం