ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATI FARMERS MAHA PADAYATRA IN NELLORE : రైతుల పాదయాత్ర ఇవాళ యథాతథం - అమరావతి ఐకాస - Amaravati farmers maha padayatra continue

రెండు రోజులుగా నిలిచిపోయిన అమరావతి(Amaravathi Maha padayatra in nellore district) రైతుల పాదయాత్ర నేడు యథావిధిగా కొనసాగనుంది. నెల్లూరు జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ పాదయాత్రను నిర్వహిస్తామని ఐకాస కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు.

అమరావతి రైతుల మహాపాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్ర

By

Published : Nov 30, 2021, 1:05 AM IST

నేటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర యథావిధిగా(Maha Padayatra continue from tomorrow) కొనసాగుతుందని ఐకాస కో-కన్వీనర్ గద్దె తిరుపతి రావు తెలిపారు. నెల్లూరు జిల్లాలో వర్షాల కారణంగా రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఎనినిది గంటలకు యాత్ర ప్రారంభమై... మరువూరు వరకు సాగనుందని గద్దె తిరుపతి రావు వెల్లడించారు. జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఇంకా ఉన్నప్పటికీ... నేడు పాదయాత్రను నిర్వహిస్తామని వివరించారు.

రైతులు బస చేసిన శాలివాహన ఫంక్షన్ హాల్​లో నెల్లూరుకు చెందిన నరసింహనాయుడు... గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. రాజధాని రైతుల పాదయాత్ర జయప్రదం కావాలని సంకల్పించారు. గుంటూరు జిల్లా పెద్దపరిమి గ్రామానికి చెందిన ఘంటా శివరావు అమరావతి ఉద్యమానికి రూ.లక్ష విరాళం అందించారు. నెల్లూరు జిల్లా మేడూరు గ్రామ ప్రజలు పాదయాత్ర చేస్తున్న రైతులకు మందులు అందజేశారు.

ఇదీచదవండి.

DIG Palaraju as Vijayawada incharge CP: విజయవాడ ఇంఛార్జి సీపీగా డీఐజీ పాలరాజు

ABOUT THE AUTHOR

...view details