ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దాడి చేసింది ఎవరో తెలియదు.. పేర్లు ఎలా రాయాలి..?'

పోలీసులపై తీరుపై ఉద్దండరాయునిపాలెం రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 6న తమపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ... గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఫిర్యాదులో దాడిచేసిన వారి పేర్లు స్పష్టంగా పేర్కొనాలని పోలీసులు సూచించారు. వారెవరో తమకు తెలియదని, ఫొటోల ఆధారంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Amaravati Farmers Complaint on Unknown Attackers
ఉద్దండరాయునిపాలెం రైతుల అసహనం

By

Published : Dec 9, 2020, 7:40 PM IST

ఉద్దండరాయునిపాలెం రైతులు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఈనెల 6న తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీస్​స్టేషన్​కు ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు రైతులు వచ్చి ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారి పేర్లను స్పష్టంగా రాయాలని చెప్పారు. దీనికి తాము అభ్యంతరం తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు. దాడికి పాల్పడింది ఎవరో తమకు తెలియదని సమాధానమిచ్చారు.

దాడికి సంబంధించిన వీడియో, ఫొటోలు ఇస్తామని చెప్పినా... పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని రైతులు వాపోయారు. గతంలో ధర్నాలో పాల్గొన్న సమయంలో తమపై ఫొటోల ఆధారంగా కేసులు పెట్టలేదా..? అని రైతులు గుర్తుచేసినా.. పోలీసులు అవేవి తమకు తెలియదన్నారని రైతులు చెప్పారు.

ఇదీ చదవండీ... ఉద్దండరాయునిపాలెం వద్ద ఉద్రిక్తత.. రైతులను అడ్డుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details