ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amravati Farmers Protest: 'అంత ప్రేమ ఉంటే.. పరిశ్రమను కాపాడండి' - అమరావతి రైతులు

రాజధానిని ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. రాజధానిని అభివృద్ధి చేసే సత్తా వైకాపాకు లేదని మహిళలు విమర్శించారు.

amaravati farmers
amaravati farmers

By

Published : Aug 29, 2021, 2:02 PM IST

రాజధానిపై ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. రాజధానిని ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయపూడిలో మంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. బొత్సకు విశాఖపై అంత ప్రేమ ఉంటే.. ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా చూడాలని సవాల్ విసిరారు.

రాజధాని ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలలో తమ పిల్లలు చదువుకోవడం లేదని చెప్పారు. ఆ విశ్వవిద్యాలయాలలో ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమని.. దీనిని ఒకే సామాజిక వర్గానికి కట్ట పెట్టడం సరికాదని హితవు పలికారు. రాజధానిని అభివృద్ధి చేసే సత్తా వైకాపాకు లేదని మహిళలు చెప్పారు. దీనిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు.

ABOUT THE AUTHOR

...view details