ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పుదుచ్చేరికి సాధ్యమైన ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి ఎందుకు కుదరదు?' - ప్రత్యేక హోదాపై సీఎం జగన్​ను ప్రశ్నించిన రాజధాని రైతులు

అమరావతి మహిళలు, రైతుల ఆందోళనలు 472వ రోజుకు చేరాయి. సీఎం జగన్ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని రైతులు ఆరోపించారు. పుదుచ్చేరికి సాధ్యమైన హోదా రాష్ట్రానికి ఎందుకు కుదరదని నిలదీశారు.

amaravati agitation reached 472 days, amaravati farmers questioned cm on special status
472వ రోజుకి చేరిన అమరావతి రైతులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎంను ప్రశ్నించిన రాజధాని రైతులు

By

Published : Apr 2, 2021, 9:52 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. రైతులు, మహిళలు నిర్వహించిన ఆందోళన 472వ రోజుకి చేరింది. ప్రత్యేక హోదా పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్వప్రయోజనాల కోసం ప్రధాని మోదీ కాళ్ల వద్ద హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న ముఖ్యమంత్రి.. ఇపుడు కేంద్రం ముందు ఎందుకు మెడలు వంచారని నిలదీశారు.

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, బోరుపాలెంలో నిరసన దీక్షలు కొనసాగాయి. పుదుచ్చేరికి సాధ్యమైన ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి ఎందుకు రాదని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం అనుమతి తర్వాతే హోదాపై ప్రకటన చేశారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details