నివర్ తుపాను ప్రభావంతో రాజధాని ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నా రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు 345వ రోజూ అమరావతి కోసం ఆందోళనచేశారు. వర్షం కురుస్తున్నా దీక్షా శిబిరాల వద్దే గొడుగులతో నిరసన చేపట్టారు.
వర్షంలోనూ కొనసాగిన అమరావతి ఆందోళనలు
నివర్ తుపాను ప్రభావంతో రాజధాని ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలను కూడా లెక్కచేయకుండా అమరావతి రైతులు, మహిళలు రాజధాని కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు 345వ రోజూ దీక్షలు చేపట్టారు.
Amaravati farmers agitation
వెంకటపాలెంలో మహిళలు నిరసన శిబిరం వద్ద వర్షంలోనే ధర్నా చేపట్టారు. లింగాయపాలెం శివాలయంలో మహిళలు పారాయణం చేస్తూ నిరసన చేశారు. వర్షాలు, తుపానులు వచ్చిన తమ దీక్షకు విరామం ఇచ్చే ప్రసక్తేలేదని రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి :పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత : సీఎం జగన్