పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో విధించడాన్ని అమరావతి ప్రాంత ప్రజలు స్వాగతించారు. ఉన్నత న్యాయస్థానానికి హారతులిచ్చారు. హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని రైతులు, మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చినప్పుడు... తమకు ప్రభుత్వం తరఫున కొన్ని హామీలు, హక్కులు కల్పించారని... ఆ హక్కులను కోర్టు కాపాడుతుందని పేర్కొన్నారు.
'స్టేటస్ కో'పై ఆనందం... హైకోర్టుకు హారతులు
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయంపై అమరావతి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టుకు హారతులిచ్చారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో విధించడాన్ని స్వాగతించారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని, కోర్టు తమ హక్కులను కాపాడుతుందని రైతులు, మహిళలు, యువత పేర్కొన్నారు.
హైకోర్టుకు హారతులు