అమరావతిలో రైతులు, మహిళల ఆందోళనలు 418వ రోజుకి చేరాయి. రాజధానిని రక్షించుకుంటాం.. విశాఖలో ఉక్కు కర్మాగారాన్నీ కాపాడుకుంటాం అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, దొండపాడు, నెక్కళ్లు, బోరుపాలెం, వెంకటపాలెం, నీరుకొండలో దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు.
'రాజధానిని రక్షించుకుంటాం.. ఉక్కు కర్మాగారాన్నీ కాపాడుకుంటాం' - విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ 418వ రోజున అమరావతి రైతుల నినాదాలు
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ.. అమరావతి రైతులు, మహిళలు ఆందోళన కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ.. ఆయా గ్రామాల్లో 418వ రోజూ నిరసన చేశారు. రాజధానితో పాటు ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామంటూ నినాదాలు చేశారు.
418వ రోజుకి చేరిన అమరావతి రైతుల ఆందోళన