ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతి వివాదాలు-వాస్తవాలు' పుస్తకావిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు

AMARAVATI BOOK: జర్నలిస్ట్​ కందుల రమేష్​ రచించిన 'అమరావతి వివాదాలు-వాస్తవాలు' పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

Amaravati Controversies Facts Book
Amaravati Controversies Facts Book

By

Published : Sep 8, 2022, 8:02 PM IST

Amaravati Controversies Facts Book : మహానగరాలు లేకుండా ఏ రాష్ట్రంలో అభివృద్ది జరగదని రచయిత కందుల రమేష్‌ అన్నారు. విజయవాడలో ఆయన రచించిన 'అమరావతి వివాదాలు-వాస్తవాలు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అమరావతి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1953లోనూ విజయవాడ -గుంటూరు మధ్య రాజధాని రాకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగాయని రమేష్‌ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ ఇదే తరహా రాజకీయాలు ఉన్నాయని గుర్తు చేశారు. కె. మాథ్యూస్ మొదటి ఛాయిస్​గా గుంటూరు రాజధానిగా ప్రతిపాదించారని.. 1953లో కమ్యూనిస్టు​లు గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధానికి పట్టుబట్టారని వివరించారు. ఆ రోజు కూడా ఇక్కడ రాజధాని రాకుండా చేయడానికి విశాఖను తెరమీదకు తెచ్చారని తెలిపారు. పెద్ద నగరంగా అమరావతి నిర్మాణం అవసరమన్నారు. శివరామ కృష్ణ కమిటీ చారిత్రక స్పృహ లేకుండా సిఫార్సులు చేసిందని విమర్శించారు.

'అమరావతి వివాదాలు-వాస్తవాలు' పుస్తకావిష్కరణ.. ముఖ్య అతిథిగా చంద్రబాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details