ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 612వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, మందడం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. పాలకుల మనస్సు మార్చి...అమరావతి అభివృద్ధి చెందేలా చూడాలని పూజలు చేశారు. పెదపరిమిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు. అమరావతిని అభివద్ధి చేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.