Amaravati capital Farmers: రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని సవాల్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ప్రజాధనంతో ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఇళ్లు 80% పూర్తయినప్పటికీ అలాగే వదిలేయడం, 70% నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా విస్మరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పు అమలులో జాప్యాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే అక్కడి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని రైతులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Amaravati capital Farmers: రాజధానిపై సుప్రీంకు.. అమరావతి రైతులు - రాజధానిపై అమరావతి రైతుల కీలక నిర్ణయం
Amaravati capital Farmers: ఏపీ రాజధానిపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పిల్ దాఖలు చేశారు.
రాజధానిపై సుప్రీంకు