ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని కోసం అమరావతి రైతుల పోరుబాట

amaravathi
amaravathi

By

Published : Jan 9, 2020, 10:13 AM IST

Updated : Jan 9, 2020, 2:21 PM IST

12:48 January 09

మందడంలో 23వ రోజుకు చేరిన రైతులు నిరసన

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి.మందడంలో రైతులు రిలే దీక్షలు23వ రోజుకు చేరుకున్నాయి.నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12:48 January 09

సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళా రైతులు

రాజధానిలో పెయిడ్ ఆర్టిస్టులే ఆందోళన చేస్తున్నారన్న సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మందడంలో రోడ్డుపై బైఠాయించి నల్లజెండాతో నిరసన తెలిపిన మహిళలు...ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.అన్నదాతలను కించపరిచేలా వ్యవహరించిన పృథ్వీరాజ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.రైతుల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడితే...తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

11:35 January 09

23 వ రోజు రాజధాని రైతుల మహాధర్నాకు ఎస్సీల మద్దతు

రాజధానిపై అనుచిత వైఖరితో ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేస్తోందని అసైన్డ్‌ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 23వ రోజు రాజధాని రైతుల మహాధర్నాకు మద్దతుగా ఎస్సీలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.తుళ్లూరు దళితవాడ నుంచి అంబేద్కర్‌ యువజన సంఘం తరపున రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి బయలుదేరారు.

10:14 January 09

23వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు

23వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు

మందడంలో రహదారిపై టెంటు వేసి రైతుల మహాధర్నా

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతుల డిమాండ్

జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలు, ఫొటోలు పట్టుకుని రైతుల ధర్నా

మధ్యాహ్నం రైతు దీక్షాస్థలి వద్దకు వచ్చి మద్దతు తెలపనున్న లోకేశ్‌

10:14 January 09

మేము ఎవరినీ అరెస్టు చేయలేదు: తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

వెంకటపాలెం కరకట్టపై అడ్డుకోవడంపై స్పందించిన తుళ్లూరు డీఎస్పీ

మేము ఎవరినీ అరెస్టు చేయలేదు: తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

అధికారుల ఆదేశాల మేరకు వారిని వెళ్లకుండా అడ్డుకున్నాం: డీఎస్పీ

నిన్న చినకాకాని జాతీయరహదారి దిగ్బంధంలో తనిఖీల కోసమే ఆపాం: డీఎస్పీ

అడ్డుకున్న వారిని మంగళగిరి పోలీసుస్టేషన్‌కు రావాలని కోరాం: డీఎస్పీ

పరిశీలన కోసం మండడంలోని డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చాం: డీఎస్పీ

మందడం తీసుకొచ్చి తాగడానికి నీళ్లు, టీ కూడా ఇచ్చాం: తుళ్లూరు డీఎస్పీ

ఈలోగా చాలామంది రైతులు, గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు: డీఎస్పీ

10:13 January 09

పార్టీ పేరులో రైతు అని పెట్టుకున్న వైకాపా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది: రైతులు

పార్టీ పేరులో రైతు అని పెట్టుకున్న వైకాపా...ఇప్పుడు తమ శవాలపైనే రాజకీయాలు చేస్తోందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతి ఆవేదనతో గుండె ఆగి మరణించిన రైతుల త్యాగాలనూ కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కూతవేటు దూరంలోనే ఇంతమంది ఆందోళన చేస్తున్నా...జగన్‌కు కనికరం కలగడం లేదా అని వారు ప్రశ్నించారు.

10:01 January 09

అమరావతి రైతులకు మద్దతుగా అఖిలపక్ష ఐకాస ఆధ్వర్యంలో మహాపాదయాత్ర

అమరావతి రైతులకు మద్దతుగా అఖిలపక్ష ఐకాస ఆధ్వర్యంలో మహాపాదయాత్ర

తెనాలి నుంచి అమరావతికి అఖిలపక్ష ఐకాస ఆధ్వర్యంలో మహాపాదయాత్ర

పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు; నాయకుల గృహనిర్బంధం

నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్ గృహనిర్బంధం

పెండ్యాల వెంకట రావు, సూర్యదేవర వెంకటరావు గృహనిర్బంధం

Last Updated : Jan 9, 2020, 2:21 PM IST

For All Latest Updates

TAGGED:

live

ABOUT THE AUTHOR

...view details