న్యాయదేవతపైనే తాము ఆశలు పెట్టుకున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా విజయవాడ నగర శివారు కానూరులోని మహిళలు తమ ఇంటి వద్ద నిరసన తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఆందోళనలు చేసినా.. చర్యలు తీసుకుంటామని పోలీసులు..నోటీసులు ఇచ్చిన తరుణంలో రైతులు తమ ఇళ్ల వద్దే వ్యతిరేకత తెలియజేస్తున్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి ప్రజలను నమ్మించి కుట్రపూరితంగా వ్యవహరించిందని రైతులు విమర్శించారు.
'అమరావతి విషయంలో న్యాయదేవతపైనే ఆశలు పెట్టుకున్నాం' - అమరావతి మహిళా రైతులు ఆందోళన వార్తలు
పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు. ఉద్యమానికి సంఘీభావంగా మహిళలు తమ ఇంటి వద్దే నిరసన చేపట్టారు.
amaravathi-women-farmers-protest-againist-3-capitals