గుంటూరు జిల్లా తుళ్లూరులోని రాజధాని దీక్ష శిబిరంలో ఆదివారం రాత్రి సెమి క్రిస్మస్ నిర్వహించారు. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఎస్సీ ఐకాస నేతలు క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. అంతక ముందు దీక్షా శిబిరంలో మహిళలు, రైతులు క్రైస్తవ గీతాలను ఆలపించారు. మహిళలు శాంతాక్లాజ్‌లు ధరించి సందడి చేశారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళలను సన్మానించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని క్రీస్తును వేడుకున్నారు. కులమతాలకు అతీతంగా మహిళలు, రైతులు కొవ్వొత్తుల వెలుగులో క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
దీక్షా శిబిరంలో సెమి క్రిస్మస్.. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని వేడుకోలు - అమరావతి దీక్షా శిబిరంలో సెమి క్రిస్మస్
అమరావతి రైతులు దీక్షా శిబిరంలో సెమి క్రిస్మస్ నిర్వహించారు. మహిళలు, రైతులు క్రైస్తవ గీతాలను ఆలపించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని ప్రార్థించారు.
![దీక్షా శిబిరంలో సెమి క్రిస్మస్.. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని వేడుకోలు amaravathi semi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9950742-746-9950742-1608521975161.jpg)
amaravathi semi
TAGGED:
అమరావతి రైతుల వార్తలు