ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూడు రాజధానుల నిర్ణయంతో.. భావితరాల భవితను బుగ్గిపాలు చేయొద్దు ' - అమరావతి తాజా వార్తలు

భావితరలా భవితను బుగ్గిపాలు చేయొద్దని అమరావతి రైతులు, కూలీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని ఆందోళనలు 650వ రోజుకు చేరిన వేళ.. జోరువానలోనూ మానవహారంగా ఏర్పడ్డారు.

amaravathi protest
amaravathi protest

By

Published : Sep 28, 2021, 7:20 AM IST

మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధాని అమరావతిని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ముందే ఇచ్చిన పిలుపునకు స్పందించి రాజధాని గ్రామాల నుంచి రైతులు, మహిళలు తుళ్లూరుకు చేరుకున్నారు. గొడుగులతో జోరువానలోనూ చేయిచేయి పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అన్నదాతలు చేస్తున్న ఉద్యమం సోమవారం 650వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా తుళ్లూరు శిబిరం వద్ద ఐకాస జెండాలు పట్టుకొని మానవహారంగా ఏర్పడ్డారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయస్థానాల్లో వీగిపోతుందని, అంతిమంగా రైతులే విజయం సాధిస్తారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆకాంక్షించారు. పోరాటాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలుస్తామని రైతు ఐకాస కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ పేర్కొన్నారు. రైతులంతా ఏకతాటిపైకి వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్‌ బంద్‌కు అమరావతి రైతులు కూడా మద్దతు తెలిపారు. ఐక్యంగా పోరాడి ముఖ్యమంత్రి తీరుకు గుణపాఠం చెబుతామని కృష్ణాయపాలెంలో రైతులు నినదించారు. వెంకటపాలెం, వెలగపూడి, నెక్కల్లు గ్రామాల్లో జోరువర్షంలోనూ అమరావతి ఐకాస జెండాలతో నినదించారు. మందడం, దొండపాడు, మోతడక, పెదపరిమి తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

అమరావతి కోసం బహుజన పొలికేక

అనంతవరం శిబిరంలో ఐకాస నాయకులు ‘బహుజన పొలికేక’ పేరుతో సమావేశం నిర్వహించారు. అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ, అమరావతి ఐకాస కన్వీనర్‌ సుధాకర్‌, రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్‌ షుబ్లీ, సామాజిక ఉద్యమకారుడు లక్ష్మీనారాయణ, మహిళా ఐకాస నాయకురాలు కంభంపాటి శిరీష, హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు తదితరులు ప్రసంగించారు.

ఇదీ చదవండి:AP LOANS: ఈ నెల రాష్ట్రం అప్పు రూ. 5 వేల కోట్లు

ABOUT THE AUTHOR

...view details