మహిళలను సాయంత్రం 6 తర్వాత కూడా పీఎస్‌లో నిర్బంధించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ తన ఫ్యాక్షన్ పోకడలు చూపిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
లైవ్ అప్డేట్స్: ఉద్రిక్తంగా మారిన రాజధాని రైతు ఉద్యమం - ఉద్రిక్తంగా మారిన రాజధాని రైతు ఉద్యమం
19:20 January 10
మహిళ నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం
18:47 January 10
రాత్రైనా మహిళలను పోలీసు స్టేషన్‌లో ఎలా ఉంచుతారు : కనకమేడల
అరెస్టు చేసిన మహిళలను రాత్రైనా పోలీస్‌స్టేషన్‌లో ఎలా ఉంచుతారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. 6 గంటల తర్వాత స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్స్ లేకుండా మహిళలను ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై మహిళా కమిషన్‌కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కనకమేడల అన్నారు.
18:12 January 10
నున్న పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత
విజయవాడ నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బెంజి సర్కిల్ వద్ద అరెస్టు చేసిన మహిళలను నున్న పీఎస్‌కి తరలించారు. పోలీసు స్టేషన్ వద్ద అమరావతిని రాజధానిగా ఉంచాలని మహిళలు నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్‌కు పెద్దఎత్తున మహిళలు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న మహిళల వివరాలను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. వివరాలు చెప్పేందుకు మహిళలు నిరాకరించారు.
18:07 January 10
లోకేశ్ గృహ నిర్బంధంపై తెదేపా శ్రేణులు నిరసన
లోకేశ్, కళా వెంకట్రావు గృహనిర్బంధంపై తెదేపా శ్రేణుల నిరసన తెలిపాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తెదేపా కార్యకర్తలు తరలివస్తున్నారు. కొండవీటివాగు, ఉండవల్లి గుహల వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కరకట్ట వైపు వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
18:02 January 10
ఉండవల్లిలో లోకేశ్ గృహనిర్బంధం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావులను పోలీసులు చంద్రబాబు నివాసంలో గృహనిర్భందం చేశారు. ఇంతకుముందే వీరిని గుంటూరు కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని... మంగళగిరి తెదేపా కార్యాలయంలో దింపుతామని చెప్పి.. తెనాలి మార్గంలో తీసుకొచ్చి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గృహనిర్బంధం చేశారు. చంద్రబాబు నివాసం వైపు వచ్చే అన్ని మార్గాలనూ పోలీసులు ముళ్లకంచెలతో, బారికేడ్లతో మూసివేశారు.
17:43 January 10
అదుపులోకి తీసుకున్న మహిళలను.. నున్న పోలీసు స్టేషన్‌కి తరలింపు
విజయవాడ బందర్ రోడ్లో అమరావతి కోసం నిరసన తెలుపుతున్న మహిళలను నగర శివారులోని నున్న గ్రామీణ పోలీసుస్టేషన్‌కి తరలించారు. సుమారు నాలుగు వరుసల్లో మహిళలను స్టేషన్ తీసుకువచ్చి ఆవరణలో కూర్చోపెట్టారు. పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుంచి ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్, కేశినేని నాని మద్దతుగా మహిళల నినాదాలు చేశారు.
17:20 January 10
రైతులు, మహిళలు విడుదల
గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ నుంచి రాజధాని రైతులు, మహిళలను పోలీసులు విడుదల చేశారు. పీఎస్ ముందు రాజకీయ ఐకాస ఆందోళనతో మహిళలను పోలీసులు విడుదల చేశారు. ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని ఎంపీ గల్లా ఆరోపించారు. 144 సెక్షన్ ఉన్నట్లు ఉత్తర్వు కూడా చూపించడం లేదన్నారు. ఉన్నతాధికారులు చెప్పినట్లు రైతులు, మహిళలను అరెస్టు చేస్తారా అని గల్లా ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ఎస్పీని ప్రశ్నించినందుకే తనను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. కానిస్టేబుల్‌ను దూషించానని తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
16:57 January 10
వ్యక్తిగత పనులపై వెళ్తోన్న మహిళలు అరెస్టు
విజయవాడలో వ్యక్తిగత పనులపై వెళుతున్న మహిళలు సైతం పోలీసులు అరెస్టు చేశారు. పలువురు మహిళలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. తాము చేసిన నేరమేంటో చెప్పాలని పోలీసులపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు.
16:34 January 10
బెంజ్ సర్కిల్ వద్ద మహిళలను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ బందరు రోడ్డుపై మహిళలు బైఠాయించారు. బెంజ్ సర్కిల్ వద్దకు వెళ్లకుండా మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద రెండురోడ్ల కూడలిలో మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు.
16:30 January 10
స్వరాజ్ మైదానంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ మూసివేత
విజయవాడ స్వరాజ్ మైదానంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ మూసివేశారు. పోలీసుల ఆంక్షలతో సాయంత్రం 6 వరకు బుక్ ఫెస్టివల్ మూసివేశారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి బెంజ్ సర్కిల్‌కు మహిళలు ర్యాలీ చేస్తున్నారు. స్వరాజ్ మైదానం, సబ్‌కలెక్టర్ కార్యాలయం, బెంజ్ సర్కిల్ వద్ద పోలీసుల ఆంక్షలు పెట్టారు.
16:11 January 10
అరెస్టులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ట్వీట్
తుళ్లూరులో మహిళల మీద పోలీసుల చర్యలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ రానుంది. కమిటీని రేపు పంపిస్తున్నామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేశారు.
15:50 January 10
నల్లపాడు పీఎస్ ముందు రాజకీయ ఐకాస ఆందోళన
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్ వద్ద రాజకీయ ఐకాస నేతలు పాల్గొన్న గల్లా, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు ఆందోళన చేపట్టారు. రైతులు, మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
15:48 January 10
మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌పై కేసు
మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తుళ్లూరులో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేశారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు.
15:44 January 10
అరెస్టైన రైతులు, మహిళలు స్టేషన్‌కు తరలింపు
రాజధాని ప్రాంతంలో అరెస్టు చేసిన రైతులు, మహిళలను గుంటూరు, మంగళగిరి, తాడికొండ పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా వాహనాల్లో తరలించటంపై మహిళల అభ్యంతరం వ్యక్తం చేశారు. తాగేందుకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని మహిళలు ఆవేదన చెందారు.
12:53 January 10
కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కనకదుర్గమ్మవారికి పొంగళ్లు పెట్టుకునేందుకు బయలుదేరిన ప్రజలను..... పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలయ్యింది. పోలీసులు, ప్రజలకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుపై ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇనుప కంచెలు దాటుకుని ముందుకి కదిలారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పలువురు రైతులు, మహిళలు లాఠీఛార్జిలో గాయపడ్డారు. పోలీసులు వారిని విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించారు. పోలీసుల తీరు నిరసనగా ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును గట్టిగా విమర్శించారు..
12:52 January 10
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఐకాస చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న రాజకీయ ఐకాస నేతలు..కార్పోరేషన్ కార్యాలయం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు.తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు,వామపక్షనేతల్ని అరెస్ట్ చేశారు.పోలీసుల తీరు పట్ల పత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహంవ్యక్తంచేశారు.రాజధాని తరలింపుని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు
12:52 January 10
ఎమ్మెల్యేను కారులో నుంచి బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు'
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు బస్సు యాత్ర నేపథ్యంలో.... పలువురు తెదేపా నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఏలూరులో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు... ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెళ్తుండగా... పోలీసులు తణుకు వద్ద అడ్డుకున్నారు. పోలీసులతో ఎమ్మెల్యే రామానాయుడు వాగ్వాదానికి దిగారు. పోలీసులు నిమ్మలను కారులో నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.తణుకు పీఎస్‌కు తరలించారు.దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
12:52 January 10
'గుడిలోపల మహిళలు-బయట పోలీసులు'
మందడం పోలేరమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లినవారిని....పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.గుడి లోపల ఉన్న మహిళలను బయటకు వస్తే అరెస్టు చేసేందుకు....పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.శుక్రవారం అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం తమ ఆచారమని...దైవ దర్శనానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలా అని...మహిళలు ప్రశ్నిస్తున్నారు
10:49 January 10
రాజధాని రణరంగం
3 రాజధానుల ప్రతిపాదనలను నిరసిస్తూ.... 24వ రోజు విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకూ రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన వేళ..... తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు... రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలేరు అమ్మవారికి నైవేద్యం పోలీసులు పెడుతుండగా అడ్డుకున్నారు. ఫలితంగా... పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. అనేక మంది రైతులను అరెస్టు చేసి వ్యాన్‌లో తరలించారు.
10:49 January 10
తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి-పోలీసుల లాఠీఛార్జి
తుళ్లూరులో పోలీసుల తీరు ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు, మహిళలు.. అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జికి దిగారు. ప్రజలు ముందుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు తరలివెళ్లారు. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలకు గాయాలయ్యాయి.
09:47 January 10
తుళ్లూరు నుంచి ఉద్ధండరాయునిపాలేనికి బయల్దేరిన రైతులు, మహిళలు
తుళ్లూరు నుంచి ఉద్ధండరాయునిపాలేనికి బయల్దేరిన రైతులు, మహిళలు
ఉద్ధండరాయునిపాలెం వెళ్తుండగా పలువురిని అడ్డుకున్న పోలీసులు
ఉద్ధండరాయునిపాలెం వెళ్లిన మరికొందరు రైతులను అడ్డుకున్న పోలీసులు
రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకున్న మహిళలు
09:47 January 10
మందడంలో పోలేరమ్మ గుడి వద్ద ఉద్రిక్తత
మందడంలో పోలేరమ్మ గుడి వద్ద ఉద్రిక్తత
అమ్మవారికి నైవేద్యం పెడుతుండగా అడ్డుకున్న పోలీసులు
మందడంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట
పోలేరమ్మ గుడి వద్ద కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:47 January 10
శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పోలీసుల అనుమతి కావాలా?: మహిళలు
శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పోలీసుల అనుమతి కావాలా?: మహిళలు
మా గ్రామంలో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రభుత్వ అనుమతి కావాలా?: మహిళలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా... పాకిస్తాన్‌లో ఉన్నామా అన్నట్లు ఉంది: మహిళలు
గుడికి వెళ్లేందుకు ఇంతమంది పోలీసులు అవసరమా?: మహిళలు
అమ్మవారికి పొంగళ్లు పెడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు: రైతులు
మేము ఆందోళన చేస్తున్నామా.... అమ్మవారిని దర్శించుకోవడం తప్పా?: రైతులు
09:47 January 10
నరసరావుపేట పోలీసుల అదుపులో తుళ్లూరు రైతులు
నరసరావుపేట పోలీసుల అదుపులో తుళ్లూరు రైతులు
నరసరావుపేట ఒకటో పట్టణ పీఎస్‌కు రైతుల తరలింపు
పోలీసుల అదుపులో ఉప్పలపాటి సాంబశివరావు, పువ్వాడ గణేష్
పోలీసుల అదుపులో అప్పారావు, మార్తా రవి, బొర్రా సాంబశివరావు, బండ్ల తేజ
09:46 January 10
గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గృహనిర్బంధం
గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గృహనిర్బంధం
అమరావతి నుంచి ధరణికోట వరకు ర్యాలీలో పాల్గొనకుండా కొమ్మాలపాటి గృహనిర్బంధం
09:46 January 10
తుళ్లూరులో రాజధాని రైతుల ధర్నాపై పోలీసుల ఆంక్షలు
తుళ్లూరులో రాజధాని రైతుల ధర్నాపై పోలీసుల ఆంక్షలు
రహదారి పక్కన టెంట్ వేయకుండా అడ్డుకున్న పోలీసులు
09:46 January 10
మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
మందడంలో రహదారిపై బైఠాయించేందుకు రైతుల యత్నం
రహదారిపై రైతులు వేసుకున్న పరదాలను బలవంతంగా తొలగించిన పోలీసులు
09:37 January 10
నేతల గృహనిర్బంధం..పోలీసులు పహారా
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధం చేస్తున్నారు. చంద్రబాబు, ఐకాస ర్యాలీలో పాల్గొనకుండా నియంత్రించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అమరావతి ఐకాస ప్రజా చైతన్య యాత్ర విజయవాడ, ఏలూరు మీదుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న క్రమంలో విజయవాడలో తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందును గృహ నిర్బంధం చేశారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను గృహానిర్బంధం చేశారు. బెంజి సర్కిల్ లో ఐకాస కార్యాలయం గేట్ కు పోలీసులు తాళం వేశారు.
08:50 January 10
విజయవాడ: ఐకాస చేపట్టిన ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు: సీపీ
విజయవాడ: ఐకాస చేపట్టిన ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు: సీపీ
విజయవాడలో సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమలులో ఉంది: సీపీ
ప్రజలకు ఇబ్బంది కలిగే నిరసనలకు పోలీసుల అనుమతి ఉండదు: సీపీ ద్వారకా తిరుమలరావు
శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగేలా ర్యాలీలు, నిరసనలు చేపట్టేవారిపై కఠిన చర్యలు: సీపీ
08:20 January 10
144 సెక్షన్ పేరుతో... గృహనిర్బంధం..ముందస్తు అరెస్టులు
3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన వేళ....... కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నాయకుల గృహనిర్బంధం, ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విజయవాడలో...... తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందును... గృహనిర్బంధం చేశారు. బెంజ్ సర్కిల్‌లో ఐకాస కార్యాలయానికి తాళం వేసిన పోలీసులు...... పెనమలూరు మాజీ MLA బోడె ప్రసాద్‌నూ.... గృహనిర్బంధించారు.
07:45 January 10
రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరించారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వెల్లనున్న రైతులు. ఉద్ధండరాయునిపాలెంలో పూజల అనంతరం అమ్మవారికి పొంగళ్లు తీసుకెళ్లాలని రైతుల నిర్ణయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 144 సెక్షన్, 30 యాక్టు అమలు దృష్ట్యా ఎవరూ బయటకు రావద్దని పోలీసుల ప్రకటించారు. గ్రామాల ప్రధాన కూడళ్లలో ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు పోలీసులు. మందడం, వెలగపూడిలో రైతులు బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
07:43 January 10
ఉద్రిక్తంగా మారిన రాజధాని రైతు ఉద్యమం
తుళ్లూరులో రహదారిపై టెంట్ వేయవద్దని పోలీసుల ఆదేశాలు జారీచేశారు. తుళ్లూరులో 10 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న రైతులను నరసరావుపేట వైపు తీసుకెళ్తున్నారు.