కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తున్నామని... అమరావతి పరిరక్షణ సమితి ఐకాస తెలిపింది. అమరావతి కోసం చేసే ఉద్యమంలో స్వల్ప మార్పులు చేస్తూ కొనసాగిస్తామని ఐకాస నాయకులు తెలిపారు. ఇక నుంచి ప్రతి దీక్షా శిబిరంలో 15 నుంచి 20 మంది మాత్రమే కూర్చుంటామని చెప్పారు. ఇంటి వద్దే ఉండి ఆందోళన చేస్తూ... ప్రతి ఇంటికి బ్యానర్లు, జెండాలు కట్టాలని నిర్ణయించామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఇంట్లో లైట్లు ఆపేసి 5 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగించి 'అమరావతి వెలుగు' పేరుతో నిరసన తెలుపుతామని వివరించారు.
'ప్రధాని సూచనలు పాటిస్తాం... స్వల్ప మార్పులతో కొనసాగిస్తాం' - అమరావతి ఉద్యమం
ప్రధాని మోదీ సూచనలు పాటిస్తూనే... ఉద్యమాన్ని కొనసాగిస్తామని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు తెలిపారు. ఇంటి వద్దే ఉండి తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అమరావతి ఉద్యమం