ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: అమరావతి పరిరక్షణ సమితి

By

Published : Jul 12, 2020, 10:42 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి... గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​కు లేఖ రాశారు. మూడు రాజధానుల ప్రతిపాదన, బిల్లులు ఉపసంహరించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Amaravathi parirakshana samiti jac letter written to governor at amaravathi
గవర్నర్ కు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ లేఖ

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి ... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏపీ పరిపాలన వికేంద్రికరణ బిల్లు-2020, సీఆర్డీఏ రద్దు బిల్లులు రెండింటిని జనవరి 21, 2020న సెలెక్ట్ కమిటీకి పంపించిందని.. గతంలో ఈ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు చర్చే లేకుండా అమోదించారని శివారెడ్డి తెలిపారు.

ఈ బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టడం ద్వారా రాజధాని ప్రాంత రైతుల హక్కులకు భంగం కలుగుతుందని చెప్పారు. వీటిపై ఇప్పటికే మండలి ఛైర్మన్​కి ఫిర్యాదు చేశామని.. అధికరణ 197 (2) ప్రకారం బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ కు రాసిన లేఖలో శివారెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details