ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని తరలిస్తే.. వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి' - amaravati parirakshana samiti news

సీఎం.. విశాఖ పర్యటనలో భారీ మానవహారం ఏర్పాటుచేయాలని నిర్ణయించడం దేనికి సంకేతమని అమరావతి పరిరక్షణ సమితి ప్రశ్నించింది. రేపు... ఉదయం అన్ని జిల్లాల్లో గాంధేయమార్గంలో మౌనంగా మాననహారాలు చేసి నిరసనలు తెలిపాలని నిర్ణయించింది. రాజధానిని తరలిస్తే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేసింది.

Amaravathi parirakshana samiti activites
అమరావతి పరిరక్షణ సమితి

By

Published : Dec 26, 2019, 11:14 PM IST

విశాఖలో.. ముఖ్యమంత్రికి 24 కిలోమీటర్ల మేర మానవహారంతో స్వాగతం పలకాలని నిర్ణయించడం.. దేనికి సంకేతమని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి ప్రశ్నించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 వరకు అన్ని జిల్లాలో గాంధేయమార్గంలో మౌనంగా మానవహారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు.. రాష్ట్రభవిష్యత్​ను నిర్ణయించే రోజన్న శివారెడ్డి... సేవ్ అమరావతి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాజధానిని తరలిస్తే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలన్నారు. వారిని గెలిపించిన ప్రజల కోసం రేపటి.. కేబినెట్​లో ప్రజల ఆవేదనను వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్..రైతుల సమస్యలను గుర్తించి రాజధానిని ఇక్కడే కొనసాగించాలన్నారు.
రేపు విజయవాడలో విజయ్ టాకీస్ నుంచి బీఎస్​ఎన్​ఎల్ చుట్టిగుంట వరకూ మానవహారం చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు ఆర్​.వి స్వామి తెలిపారు. ఐలా అసోసియేషన్​లో ఉన్న 34 అనుబంధ సంఘాలు జేఏసీతో కలిసి వస్తున్నాయన్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా అమరావతి యూత్ ఫోర్స్​ను ఏర్పాటుచేస్తున్నట్లు స్వామి ప్రకటించారు.

అమరావతి పరిరక్షణ సమితి

ABOUT THE AUTHOR

...view details