అమరావతి రైతుల మహాపాదయాత్ర అమరావతి రైతుల మహాపాదయాత్ర(amaravati capital farmers maha padayatra news) 17వ రోజు జైత్రయాత్రలా సాగింది. కందుకూరు(kandukuru)లోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభమైంది. పూజల అనంతరం ప్రారంభమైన పాదయాత్ర.. జై అమరావతి నినాదాలతో ఊళ్లు దాటుకుంటూ కొనసాగింది. కొండముడుసుపాలెం(kondamudusupalem) వద్ద రహదారిపై నీటి ప్రవాహం ఉన్నా లెక్క చేయకుండా అందులోనుంచే ఒకరి వెంట ఒకరు ముందుకు సాగారు.
విశ్వాసం రెట్టింపైంది...
కొండముడుసుపాలెం మీదుగా జనప్రవాహంలా రైతుల యాత్ర మోపాడు(mopadu)కు సాగింది. గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ ప్రజలు రైతుల్ని ఆహ్వానించారు. మోపాడు చేరుకున్న రైతులు అక్కడ మధ్యాహ్నం భోజనం చేశారు. కాసేపు విరామం అనంతరం మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. మోపాడు ప్రజలు పాదయాత్ర(padayatra)కు ఎదురెళ్లి రైతులకు ఆహ్వానం పలికారు. రైతులకు ఊరంతా కలిసి భోజన(lunch) ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులే రైతుల్ని తమతమ ఇళ్లకు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న యాత్రను చూసి రైతులు తమ విశ్వాసం రెట్టింపైందని హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి పాదయాత్రకు మద్దతు ఇస్తున్న వారిపై ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. 700రోజులకు పైగా శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పటికీ.. మూడు రాజధానులు చేసి తీరుతాం అని వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం. న్యాయస్థానంలోనూ మేమే విజయం సాధిస్తాం. - అమరావతి రైతు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి సమాన దూరంలో ఉంది. అందుకే అన్ని పార్టీల నేతలు దీనికి మద్దతు తెలిపాయి. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదం. - అమరావతి రైతు
న్యాయస్థానంలోనూ విజయం సాధిస్తాం...
మహాపాదయాత్రకు రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోందని అమరావతి రైతులు అన్నారు. తమకు లభిస్తున్న స్పందన చూసి ప్రభుత్వం(Government) తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు కట్టి తీరతామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయస్థానం(Court)లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ 16 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టిన రైతులు గుడ్లూరుకు చేరుకున్నారు. గుడ్లూరు సమీపానికి యాత్ర చేరుకోగానే గ్రామస్థులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఉప్పుటేరు వంతెన వద్ద పూలతో జై అమరావతి(Jai amaravati) అని రాసి రైతుల్ని ఆహ్వానించారు. అలాగే రైతుల రాక కోసం భారీ సంఖ్యలో వేచిచూసిన గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ రైతులు గుడ్లూరులోనే బస చేయనుండగా వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు.
అమరావతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రైతులకు అభినందనలు. భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - ప్రకాశం జిల్లా వాసి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన మహా రాజధాని రైతులు నిర్వహించిన పాదయాత్ర కు సంఘీభావంగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరయ్యారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆకాంక్షించారు. మూడు రాజధానుల వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని అన్నారు.