అమరావతి ఉద్యమాన్ని.. రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారుస్తామని.. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు.. సెప్టెంబరు మొదటి వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని మండలాల్లో పర్యటిస్తామని ఐకాస కన్వీనర్ సుధాకర్ చెప్పారు. వారంలో నాలుగు రోజులు ఆయా మండలాల్లో పర్యటించి అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో పర్యటించి రాజధాని ఉద్యమానికి ప్రజల మద్దతును కూడగడతామన్నారు.
అమరావతి ఉద్యమాన్ని.. రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారుస్తాం- రాజధాని ఐకాస - అమరావతి ఉద్యమం తాజా వార్తలు
అమరావతి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. సెప్టెంబరు మొదటి వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి.. అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఉద్యమానికి ప్రజల మద్దతును కూడగడతామన్నారు.
![అమరావతి ఉద్యమాన్ని.. రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారుస్తాం- రాజధాని ఐకాస amaravathi movement reached to 619 day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12894155-675-12894155-1630068272049.jpg)
amaravathi movement reached to 619 day
619 వ రోజూ రాజధాని గ్రామాల్లో నిరసన దీక్షలు
ప్రభుత్వం అమరావతికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచుతామని సుధాకర్ చెప్పారు. రాజధాని ఉద్యమంపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, ధూషించినా, సామాజిక మాద్యమంలో పోస్టులు పెట్టిన వారిని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో తిరగకుండా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. అటు 619వ రోజు రాజధాని గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు.
ఇదీ చదవండి: palamuru-rangareddy projecct : కమిటీ నోడల్ ఏజెన్సీగా తెలంగాణ గనుల శాఖ తొలగింపు