రాజధాని పరిధిలో భూముల అవకతవకల వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొందరు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో సీఐడీ.. ఐపీసీ సెక్షన్లు 420, 506ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలియచేసింది. ప్రస్తుతం వీటన్నిటిపైనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు.
రాజధాని భూముల కేసు సీబీఐకి అప్పగింత - సీబీఐకి అమరావతి భూముల కేసు అప్పగింత వార్తలు
అమరావతి పరిధిలోని భూముల అవకతవకల వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
amaravathi land issue case transfer to CBI for enquiry