వైకాపా ప్రభుత్వం 144 సెక్షన్‌తో అమరావతి పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తోందని అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. విజయవాడలో మాట్లాడిన పరిరక్షణ సమితి నేతలు.. మహిళలను కులం పేర్లు అడిగి కించపరచడాన్ని ఖండించారు. రాత్రి 9 గంటల వరకు వారిని పోలీసుస్టేషన్లో ఉంచడమేంటని నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. 'ఇది పోలీసుల రాజ్యమా.. ప్రజారాజ్యమా' అని నిలదీశారు.
రేపట్నుంచి పోలీసుస్టేషన్లకు వెళ్లి పండ్లు ఇచ్చి సహకరించాలని కోరతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలన్నారు పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు.