ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్తాం: అమరావతి ఐకాస - అమరావతి ఉద్యమం తాజా వార్తలు

కొవిడ్ ఉద్ధృతి తగ్గగానే అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని పోరాట ఐక్య కార్యాచరణ సమితి నేతలు తెలిపారు. అమరావతి ఉద్యమం 600వ రోజున పోలీసుల చర్యలను నేతలు ఖండించారు.

amaravathi movement
amaravathi movement

By

Published : Aug 9, 2021, 5:28 PM IST

అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్తామని ఐకాస నేతలు ప్రకటించారు. రాజధాని పరిరక్షణ ఉద్యమం 600వ రోజున పోలీసుల చర్యను ఐకాస నేతలు ఖండించారు. అమరావతిలో ఉద్యమమే లేదని చెబుతున్న ప్రభుత్వ పాలకులకు.. నిన్న జరిగిన ఘటన కనువిప్పు అని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి చెప్పారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గగానే మరింతగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

రైతుల ఆవేదన మంత్రి కురసాల కన్నబాబుకు పండగలాగా కనిపిస్తుందా అని రాజధాని పరిరక్షణ పోరాట ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు రాజధానిలో పర్యటిస్తే ఇక్కడ పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details