ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిబ్రవరి 7న అమరావతి ఐకాస బహిరంగ సభ - మూడు రాజధానులపై వార్తలు

ఈ నెల 7న బహిరంగసభ నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస తెలిపింది. అనుమతుల కోసం విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు దరఖాస్తు చేశారు.

amaravathi jac meet at vijayawada
అమరావతి ఐకాస బహిరంగసభ

By

Published : Feb 1, 2020, 7:30 PM IST

అమరావతి ఐకాస బహిరంగసభ

రాజధాని రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ నెల 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభకు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అనుమతుల కోసం విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు దరఖాస్తు చేశారు. ఫిబ్రవరి7 సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర మార్కెట్ నుంచి మిల్క్ ఫ్యాక్టరీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఐకాస నేతలు తెలిపారు. అనంతరం మిల్క్ ఫ్యాక్టరీ వద్ద బహిరంగసభ నిర్వహించనున్నారు.

మరోవైపు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు రాజధానిపై తన వైఖరేంటో చెప్పాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. 45 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ఎంపీ వచ్చి చర్చలకు రైతులను ఆహ్వానించటం విడ్డూరంగా ఉందని ఐకాస నేతలు అన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రం ఆశించినవి కేంద్ర బడ్జెట్​లో కనిపించాయి: వైకాపా ఎంపీ

ABOUT THE AUTHOR

...view details