విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభం - అమరావతి ఐకాస నేతల అడ్డగింత వార్తలు
విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి తెదేపా అధినేత చంద్రబాబు, వామపక్ష, ఐకాస నేతలు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న కల్యాణ మండపం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం... విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు చైతన్యయాత్ర మొదలుకానుంది.
Amaravathi JAC meet at vijayawada