AMARAVATHI JAC LETTER TO PM: ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ - amaravathi jac letter to pm modi

11:13 November 22
amaravathi jac letter to pm modi
ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ రాసింది. పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడానికి జోక్యం చేసుకోవాలని లేఖలో అభ్యర్థించారు. హైకోర్టు అనుమతితో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. కొన్ని సందర్భాల్లో లాఠీఛార్జ్ చేశారని లేఖలో ఆరోపించారు. అమరావతి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మూలిస్తోందన్నారు. అమరావతి ఆర్థిక అంశాల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: