వైకాపా వారితో.. ముఖ్యమంత్రి జగన్ రహస్య బ్యాలెట్ నిర్వహించినా.. మెజారిటీ సభ్యులు రాజధాని తరలింపును సమ్మతించబోరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని మార్పు అంశంపై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలపై విశ్వాసం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అమరావతి అజెండాగా ఎన్నికలకు వెళ్లాలని కోరారు. అమరావతి ప్రాంత మహిళలు రాష్ట్రాన్ని కాపాడాలంటూ హైకోర్టుకు వెళ్లే మార్గంలో మోకాళ్లపై నిలుచుని ప్రాధేయపడేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
'రహస్య బ్యాలెట్ నిర్వహిస్తే.. వైకాపా నేతలు అమరావతికే ఓటేస్తారు'
పరిపాలన వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయంపై న్యాయస్థానం ఈనెల 14 వరకు యథాపూర్వక స్థితిని కొనసాగించాలని ఆదేశించడంపై అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, వివిధ రాజకీయపక్షాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి విషయంలో పునరాలోచించాలని పరిరక్షణ సమితి సహ కన్వీనరు ఆర్.వి.స్వామి కోరారు.
amaravathi jac leaders on high court stay
రాష్ట్రవిభజనతో ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి దశ నుంచి పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే స్థితికి చంద్రబాబు తన పరిపాలన అనుభవంతో తీర్చిదిద్దారని... మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ అన్నారు. అమరావతి రాజధానిగా భావించి ఇక్కడ అనేక మంది పెట్టుబడులు పెట్టారని... వారి విషయంలో ముఖ్యమంత్రి ఓ స్పష్టత ఇవ్వాలని భాజపా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు.