విజయవాడలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను అమరావతి మహిళా ఐకాస నేతలు కలిశారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని ఆమెను కోరారు. అమరావతి రాజధానిగా గతంలో అన్ని పార్టీలు మద్దతు పలికాయని.. ప్రధాని శంకుస్థాపనకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజధానుల మార్పు సరికాదని.. సీఎం జగన్ ఇప్పటికైనా అమరావతిపై తన తీరు మార్చుకునేలా కేంద్రం చొరవ చూపాలని ఐకాస ప్రతినిధులు కోరారు.
ఐకాస నేతలతో మాట్లాడి భూములిచ్చిన రైతుల సమస్యలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. రాజధానిపై భాజపా ఇదివరకే తీర్మానం చేసిందని నిర్మలాసీతారామన్ చెప్పారని.. ఆమెను కలిశాక రాజధానిగా అమరావతే ఉంటుందన్న తమ నమ్మకం రెట్టింపు అయిందని ఐకాస నేతలు తెలిపారు.