హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి ఐకాస ధర్నా - హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట అమరావతి ఐకాస నిరసన వార్తలు
హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట అమరావతి ఐకాస, విద్యార్థులు ధర్నా చేపట్టారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఐకాస సభ్యులు నినాదాలు చేశారు. సినీ పరిశ్రమ సభ్యులు మద్దతు ప్రకటించకపోతే ఏపీలో సినిమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు.
amaravathi jac
.