రాజధానిని రాజకీయాలకు ముడిపెట్టడం తగదని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్ ఏ. శివారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు చూసి వైకాపా నేతలు వికేంద్రీకరణ విధానానాకి అనుకూలంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. స్ధానిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు పట్టం కట్టడం సహజమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం, పోలవరం ప్రాజెక్టు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, స్టీల్ ప్లాంట్ మెమోరాండంగా భావిస్తామా అని ప్రశ్నించారు.
రాబోయే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేసి అమరావతిని కాపాడుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మంత్రులు రాజధానిపై మాట్లాడే విధానం వింతగా ఉందని రైతు ఐకాస జేఏసీ ఛైర్మన్ పువ్వాడ సుధాకర్ అన్నారు. స్ధానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను వైకాపా నేతలు.. తమ పరిపాలనకు, నిర్ణయాలను రెఫరెండంగా భావిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.